కొన్న పదినిమిషాలకే పోలీసులకు పట్టుబడ్డ పోర్షే కారు!

Mon,March 12, 2018 05:43 PM

Brand New Porsche Impounded Just 10 Minutes After It Was Bought

దురదృష్టమంటే ఇదే కావచ్చు. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఏ వస్తువైనా వెంటనే మన నుంచి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటది. సేమ్.. ఇప్పుడు ఈ వ్యక్తిది కూడా అటువంటి బాధే. ఎంతో ఇష్టంతో కోట్లు వెచ్చించి ఓ పోర్షే కారును కొనుక్కున్నాడు. ఇక.. మనోడికి అస్సలు ఉబ్బు ఆగలేదు. దీంతో కారు వేసుకొని రోడ్లపై రయ్ మంటూ బయలు దేరాడు. కారు మోజులో పడి ట్రాఫిక్ రూల్స్‌నే పాటించడం మరిచిపోయాడు. సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేశాడు. ఓవర్ స్పీడ్‌తో కారును నడిపాడు. సిగ్నల్ జంప్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ట్రాఫిక్ రూల్స్‌ను జంప్ చేసిన మనోడిని సీరియస్‌గా తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు... కారును ఆపి సీజ్ చేశారు. దీంతో దాన్ని కొన్న 10 నిమిషాల్లోనే ట్రాఫిక్ పోలీసులకు అప్పగించాల్సి వచ్చింది. ఇన్ని రూల్స్‌ను బ్రేక్ చేస్తావా... 30 రోజుల వరకు నీ కారు సీజ్ చేశామంటూ పోలీసులు చావు కబురు చల్లగా చెప్పడంతో చేసేదేమి లేక ఉత్త చేతులతోనే వెనుదిరిగాడట. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగింది. ఈ విషయాన్ని విక్టోరియా పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరలవడంతో నెటిజన్లు ఆ వీడియోపై ఫన్నీగా జోక్స్ వేసుకోవడం మొదలు పెట్టారు. అదీ కథ.


8330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS