7 లక్షల విలువైన బ్రాలను దొంగలించారు!

Wed,March 14, 2018 03:04 PM

Bra Bandits steal 11,000 dollar worth Lingerie in California

ఇదో వింతైన దొంగతనం. ఈ వారంలోనే కాలిఫోర్నియాలో రెండో వింత దొంగతనం. యానిమల్ షెల్టర్‌లో గమ్‌బాల్ మిషన్‌ను దొంగలించడానికి ఓ దొంగ ఎంత ప్రయత్నించాడో తెలుసు కదా. ఆ ఘటన జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే కాలిఫోర్నియాలో మరో విచిత్ర దొంగతనం జరిగింది. అదే బ్రాలను దొంగలించడం. అది కూడా సుమారు రూ. 7 లక్షల విలువైన బ్రాలను ఇద్దరు మహిళలు దొంగలించారు.

ఫోల్సమ్‌లో ఉన్న విక్టోరియా సీక్రెట్ స్టోర్‌లో ఈ ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు... కస్టమర్లలా ఆ స్టోర్‌కు వెళ్లారు. టక టకా తాము తెచ్చుకున్న బ్యాగుల్లో బ్రాలను నింపేశారు. పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే.. బ్రాలను నింపిన బ్యాగులతో పారిపోబోతున్న మహిళలను చూసిన స్టోర్ ఉద్యోగిని వాళ్లను ఆపడానికి ప్రయత్నించింది. అయితే.. ఆ దుండగ మహిళలు వాళ్ల దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రేను ఆ ఉద్యోగిని మీద చల్లి అక్కడి నుంచి పరారయ్యారు.

అయితే.. వాళ్లు పారిపోయిన కారు నెంబర్ ఆధారంగా స్టోర్ యాజమాన్యం వెంటనే ఫోల్సమ్ పోలీసు డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా బ్రాల బ్యాగులతో పాటు ఆ దుండగ మహిళలను పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు. ఇక.. ఈ బ్రాల దొంగతనానికి సంబంధించి ఫోల్సమ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ వింత దొంగతనం చేసిన మహిళల ఫోటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఈ వింత దొంగతనం కాస్త సోషల్ మీడియాలో వైరలయిపోయింది.

5122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles