తండ్రి తిట్టాడని.. ఐదో ఫ్లోర్ విండో నుంచి బయటకు వచ్చి.. వీడియో

Fri,May 4, 2018 05:30 PM

Boy sleeps on fifth floor window ledge after scolding from dad in china

ఈ జనరేషన్‌లో పిల్లలను సాదాలంటే పేరెంట్స్‌కు తల ప్రాణం తోకకు వస్తున్నది. పిల్లలు సాదడం అంత ఈజీ కాదిప్పుడు. వాళ్లు ఏదంటే అదే. ఏమాత్రం వాళ్లను బెదిరించినా.. ఏం చేసుకుంటారో తెలియదు. అంత సున్నిత మనస్తత్వంతో పెరుగుతున్నారు నేటి పిల్లలు. తాజాగా ఓ 12 ఏండ్ల బాలుడు తండ్రి తిట్టాడని ఐదో ఫ్లోర్‌లో ఉన్న ఫ్లాట్ విండో నుంచి బయటికి వచ్చి దాని లెడ్జ్ మీదికి వెళ్లి పడుకున్నాడు. ఇక.. ఐదో ఫ్లోర్ విండో బయట ఉన్న లెడ్జ్ మీద ప‌డుకున్న‌ బాలుడిని గమనించిన స్థానికులు వెంటనే రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది క్రేన్ సాయంతో ఆ పిల్లాడిని కాపాడారు. ఈ ఘటన చైనా గైజావ్ ప్రావిన్స్‌లోని జియాంగ్‌కౌ సిటీలో చోటు చేసుకున్నది.

అసలేంజరిగిందని పిల్లాడిని ఆరా తీస్తే.. లేట్‌గా లేస్తున్నానని మా నాన్న నన్ను రోజూ తిడుతున్నాడు. ఇవాళ కూడా తిట్టాడు. అందుకే.. నా బెడ్‌రూం విండో నుంచి బయటికి వచ్చి లెడ్జ్ మీద పడుకున్నా. బెడ్‌రూంలో పడుకోనివ్వలేదు కాబట్టే.. ఇక్కడికొచ్చి పడుకున్నా. ఇక్కడ అయితే ఎవరూ డిస్టర్బ్ చేయరు కదా... అని సెలవిచ్చాడు. ఇక.. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

6382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles