ఉద్యోగుల కాళ్లు కడిగిన కంపెనీ బాస్‌లు.. వీడియో

Fri,November 8, 2019 02:43 PM

ఎవరైనా మంచి పని చేసినప్పుడు వారిని మెచ్చుకుంటాం.. ప్రశంసలతో ముంచెత్తుతాం. ఒకరి వల్ల మంచి జరిగితే.. వారి కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటాం అని అంటుంటాం. ఇప్పటి వరకు అనడమే చూశాం.. కానీ చైనాకు చెందిన ఓ కంపెనీ ప్రతినిధులు మాత్రం.. కృతజ్ఞతగా ఉద్యోగుల కాళ్లు కడిగారు. ఎందుకంటే.. కంపెనీ ప్రొడక్ట్స్‌ను అత్యధికంగా సేల్‌ చేయడమే. చైనాలోని ఓ కాస్మోటిక్‌ కంపెనీలో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 8 మంది ఉద్యోగులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ 8 మంది ఉద్యోగులు కంపెనీ ప్రొడక్ట్స్‌ను అనుకున్న దాని కంటే అధికంగా సేల్స్‌ చేశారు. దీంతో ఆ 8 మంది పాదాలను కాస్మోటిక్‌ కంపెనీ అధ్యక్షుడు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కడిగారు. మొదట 8 మందిని కుర్చీల్లో కూర్చోబెట్టి.. వారు వేసుకున్న షూను అధ్యక్షుడు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ తమ చేతులతో విప్పారు. ఆ తర్వాత వారి పాదాలను పెద్ద పాత్రల్లో పెట్టి నీటితో కడిగి కృతజ్ఞతలు చెప్పారు. అయితే దీనిపై పలువురు నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఆ 8 మందిని ఆర్థికంగా ఆదుకోకుండా పాదాలను కడిగి సరిపుచ్చుకున్నారని కొందరు విమర్శించారు.

4491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles