యూకేలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Sat,July 6, 2019 09:48 PM

bonalu celebrations held in Cardiff in UK

వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు తెలంగాణ పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారు. దీంతో తెలంగాణ పండుగలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ఇటీవలే రాష్ట్రంలో బోనాల జాతర ప్రారంభం అయింది. ఈ సందర్భంగా యూకేలోని కార్డిఫ్ నగరంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ వేల్స్(టీఏడబ్ల్యూ) ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను నిర్వహించారు. వేల్స్‌లోని పలు ప్రాంతాలకు చెందిన తెలుగు కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఈసందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారికి బోనాలు సమర్పించారు. పోతురాజుల ఆటలు, పులి వేషధారణతో సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు రాధిక, సుధా ప్రసాద్, సుజాత తల్లాడి, సునీల్ పులిపాక పాల్గొన్నారు.

896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles