లిబియా జలాల్లో మరో వలస నౌక జల సమాధి

Fri,August 28, 2015 01:41 PM

Boat packed with migrants sinks off Libya


ట్రిపోలి: మధ్యదరా సముద్రంలో గురువారం మరో వలస నౌక జల సమాధి అయింది. దాదాపు 200 మంది వలస జీవుల బతుకు సముద్రం పాలయింది. జువారా పట్టణం నుండి 400 మందితో కిక్కిరిసిన ఓ నౌక ఇటలీ వైపు బయలుదేరుతూ లిబియా తీర ప్రాంతంలో మునిగి పోయింది. తీర గస్తీ దళాలు 201 మందిని కాపాడాయి. అందులో 147 మంది అక్రమంగా వలస వెళ్తున్నట్లు తెలిసింది. వారందరిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు సమాచారం. ఆఫ్రికా, పాకిస్తాన్, సిరియా, మొరాకో, బంగ్లాదేష్ తదితర దేశాల నుండి జల సమాధి అయిన నౌకలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గురువారం వేర్వేరు సంఘటనల్లో 1,430 మందిని లిబియా సముద్ర జలాల్లో కాపాడినట్లు ఇటలీ సంస్థ ఒకటి తెలిపింది.

1780
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles