బోటు బోల్తా.. 65 మంది శ‌ర‌ణార్థులు మృతి

Sat,May 11, 2019 09:13 AM

boat capsizes in Tunisia, 65 migrants died

హైద‌రాబాద్‌: మ‌ధ్య‌ధార స‌ముద్రంలో బోటు బోల్తాప‌డింది. టునీషియా తీరం ద‌గ్గ‌ర జ‌రిగిన ఘ‌ట‌న‌లో సుమారు 65 మంది శ‌ర‌ణార్థులు చ‌నిపోయారు. ఈ విష‌యాన్ని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ వెల్ల‌డించింది. బోటులో ప్ర‌యాణిస్తున్న మ‌రో 16 మందిని ర‌క్షించిన‌ట్లు యూఎన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. లిబియాలోని జువారా నుంచి బోటు మొద‌లైన‌ట్లు దుర్ఘ‌ట‌న నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ‌వారు చెప్పారు. బ‌ల‌మైన అల‌లు రావ‌డం వ‌ల్ల బోటు బోల్తా ప‌డిన‌ట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఈ ఏడాది మొద‌టి నాలుగు నెల‌ల్లోనే లిబియా నుంచి యూరోప్ మ‌ధ్య ఉన్న జ‌ల‌మార్గంలో సుమారు 164 మంది చ‌నిపోయిన‌ట్లు యూఎన్ సంస్థ వెల్ల‌డించింది.

2795
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles