వీడియో: అయ్యో.. గాజు గ్లాసులు మీద పడ్డాయి.. అయినా బతికాడు!

Mon,December 11, 2017 04:19 PM

block of glass suddenly tilting towards a man in china

హమ్మయ్య... బతికి బయట పడ్డాడు. గాజు గ్లాసులన్నీ మీద పడి.. అవి ముక్కలు ముక్కలుగా పగిలి... వాటి లోపల ఇరుక్కుపోతే ఎవరైనా బతుకుతారా? బతికినా.. తీవ్ర గాయాలవుతాయి. కాని.. ఈ వ్యక్తికి ఇంకా భూమి మీద నూకలున్నట్టున్నయి.. అందుకే.. చిన్న గాయాలతోనే బతికి బయటపడ్డాడు. ఈ ఘటన సౌత్ చైనాలోని ఫోషన్ సిటీలో చోటు చేసుకున్నది.

గాజు గ్లాసుల సమూహాన్ని ట్రక్‌లోకి అన్‌లోడ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి వాటిని ట్రక్‌లోకి అన్‌లోడ్ చేస్తుండగా.. అతడి పక్కన ఉన్న గ్లాసు సమూహం ప్రమాదవశాత్తు కింద పడి పగిలిపోయింది. దీంతో దాని వైపు చూస్తున్న అతడు.. తన వెనక ఉన్న గ్లాసు కూడా కింద పడటాన్ని గమనించలేదు. దీంతో ఆ గాజు గ్లాస్ అతడి మీద పడటంతో అతడు కింద పడిపోగా.. గ్లాసు ముక్కలు ముక్కలయి అతడి మీద పడింది. అయితే.. అతడికి చిన్న చిన్న గాయాలు కావడంతో అక్కడివాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయింది.

2958
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS