అమెరికాస్ గాట్ టాలెంట్ షో.. ఈ స్టంట్ చూసి మీరు నోరెళ్లబెట్టాల్సిందే.. వీడియో

Thu,June 6, 2019 05:45 PM

Bir Khalsa group stunt On America Got Talent goes viral

అమెరికాస్ గాట్ టాలెంట్ షో గురించి తెలుసు కదా. యూఎస్‌లా ఫేమస్ అయిన ఈ షోను ప్రస్తుతం ప్రతి దేశంలోనూ నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ.. అమెరికాస్ గాట టాలెంట్ షోకు ఉన్న పాపులారిటీ వేరు. ఇటీవల ముంబైకి చెందిన వి.అన్‌బీటబుల్ అనే గ్యాంగ్ ఈ షోలో వైవిధ్యమైన డ్యాన్స్ వేసి అదరగొట్టారు. ఆ డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్‌ను షో నిర్వాహకులు తమ సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా అదే అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో నిర్వహించిన మరో స్టంట్ షో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది మామూలు స్టంట్ షో కాదు. మీరు మాత్రం ఆ స్టంట్ షో చూసి నోరెళ్లబెట్టాల్సిందే. మామూలుగా ఉండదు. ఊపిరి బిగపట్టుకొని మరీ ఆ వీడియో చూడాలి మీరు.

పంజాబ్‌కు చెందిన బిర్ ఖాల్సా గ్రూప్ ఈ స్టంట్ షోను నిర్వహించింది. జగ్‌దీప్ సింగ్ అనే వ్యక్తి రిలాక్స్‌డ్‌గా పడుకుంటాడు. అతడి చుట్టూ పుచ్చకాయలు, కొబ్బరి కాయలను అమర్చుతారు. మరో వ్యక్తి కవల్జిత్ సింగ్ తన కళ్లకు గంతలు కట్టుకొని పెద్ద సుత్తి తీసుకొని జగ్‌దీప్ చుట్టూ పేర్చిన పుచ్చకాయలు, కొబ్బరికాయలను టపా టపా పగులగొట్టేస్తాడు. అదే వాళ్లు చేసే స్టంట్. ఆ స్టంట్‌ను చూస్తున్నవాళ్లు, జడ్జిలు అయితే ఊపిరి బిగపట్టుకొని మరీ చూశారు. అతడు సుత్తితో వాటిని పగులగొడుతుంటే నోరెళ్లబెట్టారు. అతడికి ఏమన్నా సుత్తి తాకుతుందేమోనని భయపడిపోయారు. ఒకవేళ దారి తప్పి ఆ సుత్తి కొబ్బరి కాయలకు కాకుండా.. పడుకున్న వ్యక్తి తలకో లేక శరీరానికో తాకితే అతడు బతకడం మాత్రం కష్టమే. అంత బలంగా ఆ వ్యక్తి వాటిని పగులగొట్టాడు. ఈ వీడియోకు ఫిదా అయిన జడ్జిలు వాళ్లను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఈ వీడియోను షో నిర్వాహకులు తమ యూట్యూబ్ అకౌంట్‌లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

1949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles