బిల్ గేట్స్ మెచ్చుకున్న ఈ 'కండోమ్ కింగ్' గురించి తెలుసుకోవాల్సిందే..!

Fri,October 26, 2018 01:39 PM

Bill Gates Post On Thailand's Condom King Is A Must-Read

బిల్ గేట్స్ గురించి ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది సందర్భం కూడా కాదు కానీ.. ఓ వ్యక్తి గురించి మాత్రం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ వ్యక్తిని బిల్ గేట్స్ కూడా మెచ్చుకున్నాడు. మామూలుగా మెచ్చుకోవడం కాదు.. ఆయన గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ కూడా పెట్టాడు. అతడే కండోమ్ కింగ్. మిస్టర్ కండోమ్ అని కూడా అతడిని పిలుస్తారు.. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా.. ఇంకాస్త ముందుకు పదండి..

అది థాయిలాండ్. అక్కడే ఉంటాడు ఓ వ్యక్తి. అతడి పేరు మెకయ్ వీరవైద్య. సోషల్ యాక్టివిస్ట్. అతడు థాయిలాండ్‌లో పెరిగిపోతున్న జనాభాపై దృష్టి కేంద్రీకరించాడు. దీంతో అక్కడి ప్రజలందరినీ కండోమ్ వాడాలంటూ ఎంకరేజ్ చేస్తున్నాడు. దీంతో థాయిలాండ్‌లో పెరిగిపోతున్న జనాభాకు అడ్డుకట్టవేయడమే కాదు.. ప్రపంచంలోనే హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు వేగంగా తగ్గిపోతున్న దేశంగా థాయిలాండ్ చరిత్రకెక్కింది. దీంతో మనోడు ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు.

నిజానికి శృంగారం గురించి మాట్లాడటానికి చాలా మంది సిగ్గు పడతారు. భయపడతారు. ఎదుటి వాళ్లు ఏమనుకుంటారో అని టెన్షన్ పడుతారు. నలుగురిలో శృంగారం గురించి డిస్కస్ చేయరు. థాయిలాండ్ కూడా అంతే. అక్కడ శృంగారం గురించి ఎక్కువగా మాట్లాడుకోరు. అటువంటి దేశంలో కండోమ్‌ల వాడకం గురించి విస్తృత ప్రచారం చేసి థాయిలాండ్‌ను ఎన్నోరకాలుగా కాపాడిన మెకయ్ ఇప్పుడు థాయిలాండ్‌లో హీరో అయిపోయాడు. ఇప్పుడు ఎవరికైనా కండోమ్ కావాలంటే.. థాయిలాండ్ ప్రజలు కండోమ్ అని అడుగరు.. మెకయ్ అని పిలుస్తారట. మెకయ్ అని పిలువగానే కండోమ్ ఇస్తారట. అంతలా మెకయ్ ప్రజల్లో మార్పును తీసుకురాగలిగాడు.


ఇక.. బిల్ గేట్స్ అతడి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టగానే ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఆ మెకయ్‌ని తెగ మెచ్చుకుంటున్నారు. మెకయ్ గురించి ప్రపంచమొత్తం తెలియజేయడానికి ఓ యూట్యూబ్ వీడియోను కూడా రూపొందించాడు బిల్ గేట్స్. తన బ్లాగ్‌లోనూ మెకయ్ గురించి ఓ ఆర్టికల్ రాశాడు బిల్ గేట్స్. వావ్.. మెకయ్ సూపర్.. సొంత మనుషులనే పట్టించుకునే సమయం లేని ఈ జనరేషన్‌లో నువ్వు ప్రజల కోసం బతుకుతూ.. ప్రజలకు సరైనా దారిని చూపిస్తున్న నీకు హేట్సాఫ్. అందుకే నువ్వు బిల్ గేట్స్‌కి నచ్చావు. కాదు.. కాదు.. ఈ ప్రపంచానికే నచ్చావు.

5849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles