అవునా.. బిల్‌గేట్స్ త‌న‌ వెడ్డింగ్ కేకును అలా కోశాడా.. వీడియో

Thu,January 3, 2019 07:23 PM

Bill Gates Calculated How To Cut Wedding Cake Into Equal Slices video goes viral

అది 1994. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్, మెలిందా గేట్స్ ఒక్కటయింది ఆ సంవత్సరంలోనే. వాళ్ల పెళ్లయిన తర్వాత వెడ్డింగ్ కేక్ కట్ చేసేటప్పుడు ఓ ఫన్నీ సంఘటన జరిగిందట. ఆ ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు అంటే రెండు రోజుల కింద తమ 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో మెలిందా గేట్స్ షేర్ చేసింది.

ఇంతకీ అప్పుడు ఏం జరిగిందంటే.. తమ పెళ్లి సందర్భంగా కేక్ కట్ చేసే సమయం అది. కేక్ కట్ చేయాలంటూ బిల్‌గేట్స్‌కు కత్తిని చేతికిచ్చిందట మెలిందా. బిల్‌గేట్స్ మాత్రం.. కేక్‌ను అందరికీ పంచడం కోసం కట్ చేయాలని చెప్పిందేమో అనుకొని.. అందరు అతిథులకు వచ్చే విధంగా కేక్‌ను ముక్కలు ముక్కలుగా కట్ చేయడం ప్రారంభించాడట. బిల్‌గేట్స్ అలా చేయడాన్ని చూసి నవ్వును ఆపుకోలేకపోయిందట మెలిందా. ఆరోజు ఘటనను మళ్లీ ఇప్పుడు గుర్తు చేసుకుంది మెలిందా.తర్వాత తన ట్విట్టర్ ఖాతాలోనూ అప్పటి ఓ ఫోటోను షేర్ చేసి.. హ్యాపీ ఆనివర్సరీ బిల్ గేట్స్.. 25 సంవత్సరాల తర్వాత కూడా.. ముగ్గురు పిల్లలు పుట్టినా.. ఇంకా మనం నవ్వుతూనే ఉన్నాం.. అంటూ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్‌కు స్పందించిన బిల్ గేట్స్.. హ్యాపీ ఆనివర్సరీ మెలిందా. నీతో కలిసి మరో 25 సంవత్సరాలు నవ్వడానికి నేను సిద్ధం.. అంటూ ట్వీట్ చేశాడు బిల్ గేట్స్.

5246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles