పర్వతంపై నుంచి పడి ప్రాణాలు విడిచిన ‘బికినీ క్లైంబర్’

Tue,January 22, 2019 04:24 PM

Bikini Climber GIgi wu Dies After Ravine Fall in thaiwan

తాయ్‌పేయ్ : ఎత్తైన పర్వత ప్రాంతాలపైకి ఎక్కి సెల్ఫీలు దిగుతూ సోషల్‌మీడియాలో పాపులర్ అయిపోయింది తైవానీ బ్యూటీ గిగి వూ. గిగి వూను అందరూ బికినీ క్లైంబర్‌గా పిలుచుకుంటారు. గిగి వూ మరోసారి అలాంటిదే ఫీట్ ఒకటి చేయబోయి తన ప్రాణాలు మీదికి తెచ్చుకుంది.

తైవాన్ లోని యుషాన్ జాతీయ పార్కులోని పర్వతంపైకి ఎక్కి శాటిలైట్ ఫోన్ లో స్నేహితులతో లైవ్ లో మాట్లాడుతూ..తాను కిందికి పడిపోతున్నానంటూ సరదాగా చెప్పింది. అయితే అదే సమయంలో గిగి వూ కాలు జారి కింద పడటంతో తీవ్రగాయాలై అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఘటనాస్థలానికి చేరుకోవడం కష్టమవుతుందని రెస్క్యూ టీం అధికారులు వెల్లడించారు. పర్వతప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నాయి. వాతావరణం అనుకూలించిన తర్వాత హెలికాప్టర్ల సాయంతో గిగి వూ మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు అవకాశముంటుందని నాంటోవు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ అధికారి లిన్ చెంగ్ యి తెలిపారు.

2290
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles