కారులో నుంచి చెత్తను విసిరేసిన మహిళకు భలే బుద్ధి చెప్పిన యువతి.. వీడియో

Sun,September 23, 2018 06:56 PM

Biker has the perfect response to woman throwing garbage out of her car

చైనాలోని బీజింగ్‌లో ఓ యువతి చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ యువతి చేసిన పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆ యువతిని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది.. అంటే మనం ఓసారి బీజింగ్ వెళ్లాల్సిందే.

బీజింగ్‌లోని ఓ రోడ్డు మీద సిగ్నల్ పడింది. కారు ఆగింది. ఇంతలో కారు నుంచి ఓ చెత్త సంచి రోడ్డు మీద పడింది. దాన్ని కారులో ఉన్న ఓ మహిళ రోడ్డు మీద పడేసింది. అప్పుడే బైక్ మీద వెళ్తున్న ఓ యువతి ఆ కారు పక్కన ఆగింది. ఆ చెత్తను తీసి అదే కారులో విసిరేసింది. అక్కడ నుంచి వెళ్లిపోయింది. మళ్లీ కారులోకి చెత్తను విసిరేయడంతో కారులోని మహిళకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే డోర్ తీసి ఆ యువతిని ఆపబోయింది. కానీ.. అప్పటికే ఆ యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

16531
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles