ఆ విడాకులతో కుబేరుల ర్యాంకులు తారుమారు

Fri,January 11, 2019 03:46 PM

bejos divorce may cost him his billionaire rank

ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపక అధిపతి జెఫ్ బెజోస్ (54) తన భార్య మెకంజీకి (48) విడాకులు ఇస్తున్నారు. తన మిత్రుని భార్య లారెన్ సాంచెజ్ (49)ను వివాహమాడబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రపంచ నంబర్‌వన్ కుబేరుడు మదనుని బారినపడ్డారు. వలపు దాహంతో తల్లడిల్లుతున్నారు. హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ ప్యాట్రిక్ వైట్‌సెల్ భార్య సాంచెజ్‌కు తమకంతో ప్రేమసందేశాలు పంపుతున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాత పెళ్లాన్ని వదిలేసి కొత్త పెళ్లానికి స్వాగతం పలకడం పాశ్చాత్య సమాజంలో మంచినీళ్ల ప్రాయమైన విషయం. అయితే ఇది మామూలు విడాకులు-పెళ్లి వ్యవహారం కాదు. ప్రపంచ కుబేరుల జాబితాను ఇది తిరగరాయబోతున్నది. నాలుగు లక్షల ఎకరాల భూమితో బెజోస్ అమెరికాలో రెండో అతిపెద్ద బూస్వామిగా ఉన్నారు. అంతేకాకుండా ఆయన నికర ఆస్తుల విలువ 13700 కోట్ల డాలర్లు. మన భారతీయ కరెన్సీలో రూ.పదిలక్షల కోట్లు. అందులో భరణం కింద ఆయన మెకంజీకి చెల్లించాల్సింది 6900 కోట్ల డాలర్లు. మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.5 లక్షల కోట్లు. మెకంజీ తన వాటా తీసుకుంటే బ్లూంబెర్గ్ బిలియనీర్స్ జాబితాలో బెజోస్ టాప్ ర్యాంకు కుప్పకూలిపోతుంది. అంతేకాకుండా మెకంజీ మహిళా బిలియనీర్లలో టాప్‌లోకి వస్తుంది. ఈమెను వదిలేసి ఆమెను చేసుకుంటే ప్రపంచగతి అంతగా మారిపోతుంది మరి.

2440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles