వైరల్ ఫోటోలు: ఇది ఎయిర్‌పోర్టా లేక ఇంద్ర భవనమా?

Fri,January 19, 2018 02:55 PM

Beijing new international airport would astonish by its looks

అచ్చం ఇంద్ర భవనంలా ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్ చైనాలోని బీజింగ్‌లో ఉంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్ అక్టోబర్ 2019లో ప్రారంభం కానుంది. ఇదివరకే ఉన్న బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చాలా బిజీబిజీగా ఉండటంతో... బీజింగ్‌కు 46 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తున్నారు.

డిసెంబర్ 2014లో దీని నిర్మాణం ప్రారంభం కాగా... దీన్ని నిర్మించడానికి 12.3 బిలియన్ యూఎస్ డాలర్లను ఖర్చు చేస్తున్నారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.78,406 కోట్లు అన్నమాట.

మొత్తం 3,13,000 చదరపు మీటర్లలో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత పెద్ద ఎయిర్‌పోర్ట్‌ల్లో ఇదీ ఒకటి. మొత్తం 4 రన్‌వేలు, ప్రతి సంవత్సరం 6,20,000 విమానాలు ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలు సాగించనున్నాయి. ప్రతి సంవత్సరం 100 మిలియన్ ప్యాసెంజర్లు(10 కోట్లు), 4 మిలియన్(40 లక్షలు) టన్నుల కార్గోను ఎక్స్‌పోర్ట్ చేసే విధంగా ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తున్నారు.

ఇక.. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు.. ఆ ఫోటోలను తెగ ఫిదా అయిపోతున్నారు. ఇంతవరకు ఇటువంటి నిర్మాణంతో కట్టిన ఎయిర్‌పోర్ట్‌ను ఎక్కడా చూడలేదంటూ ఆ ఎయిర్‌పోర్ట్‌పై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.4093
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS