బీర్లతో కార్లు నడుస్తాయ్!Thu,December 7, 2017 02:44 PM

బీర్లతో కార్లు నడుస్తాయ్!

లండన్: మీరు చదివింది నిజమే. బైకులు, కార్లు నడవాలంటే ఇక పెట్రోల్‌తో పనిలేదు. బీరు ఉంటే చాలు. బీరు ద్వారా ఇంధనాన్ని తయారు చేయడంలో సక్సెస్ అయ్యారు బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు తీసుకురావాలన్న ఉద్దేశంతో సైంటిస్టులు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఆల్కహాలిక్ డ్రింక్స్‌లో ఉండే ఆల్కహాల్‌లో ఎథనాల్ ఉంటుందని, దీనిని బ్యుటనాల్‌గా మార్చి పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ ప్రొఫెసర్ డంకన్ వాస్ అన్నారు. ఎథనాల్ చాలా విరివిగా లభిస్తుంది. దీంతో దీనిని బ్యుటనాల్‌గా మార్చే టెక్నాలజీపై ఎన్నో ఏళ్లుగా సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి లేబొరేటరీ స్థాయిలో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. ఎథనాల్‌ను బ్యుటనాల్‌గా మార్చే టెక్నాలజీని కాటలిస్ట్ అంటారు. ఇప్పటికే పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో దీనిని పెద్ద ఎత్తున వాడుతున్నారు. తాజాగా తమ క్యాటలిస్ట్స్ బీర్లలోని ఎథనాల్‌ను విజయవంతంగా బ్యుటనాల్‌గా మార్చిందని డంకన్ వాస్ తెలిపారు. దీనిని లేబొరేటరీ స్థాయి నుంచి పారిశ్రామిక స్థాయికి తీసుకెళ్లడానికి సైంటిస్టులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

2706
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS