ట్రంప్ ర్యాలీలో కెమెరామ‌న్‌పై కార్య‌క‌ర్త‌ దాడి..

Tue,February 12, 2019 01:27 PM

ఎల్‌పాసో : స‌రిహ‌ద్దు వ‌ద్ద గోడ‌ను నిర్మించాల‌ని అమెరికా అధ్య‌క్ష‌డు డోనాల్డ్ ట్రంప్ భారీ ర్యాలీ తీశారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్‌పాసో న‌గ‌రంలో ఆయ‌న బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఫినిష్ ద వాల్ అంటూ ట్రంప్ కొత్త నినాదాన్ని వినిపించారు. ఇప్ప‌టికే ఈ వాల్ నిర్మాణం కోసం.. అమెరికా ప్ర‌భుత్వం స్తంభించిన విష‌యం తెలిసిందే. ద్ర‌వ్య బిల్లు ఇంకా పార్ల‌మెంట్‌లో అనుమ‌తి పొంద‌లేదు. దీంతో ష‌ట్‌డౌన్ అలాగే ఉండిపోయింది. అయితే సోమ‌వారం ర్యాలీ స‌మ‌యంలో ఓ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఎల్‌పాసో ర్యాలీలో బీబీసీ ఛాన‌ల్ కెమెరామ‌న్‌పై ఓ కార్య‌క‌ర్త చేయిచేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే అక్క‌డ ఉన్న సెక్యూర్టీ సిబ్బంది.. ఆ వ్య‌క్తిని వేదిక నుంచి బ‌ల‌వంతంగా లాక్కెళ్లారు. వాస్త‌వానికి ట్రంప్ త‌న ప్ర‌సంగంలో మీడియా తీరును త‌ప్పుప‌ట్టారు. గోడ నిర్మాణానికి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాస్తున్న మీడియా వైఖ‌రిని ట్రంప్ నిలదీశారు. ఆ స‌మ‌యంలో ఓ రిప‌బ్లిక‌న్ అభిమాని.. మీడియాపై త‌న ప్ర‌తాపాన్ని చూప‌బోయాడు. అప్పుడు అక్క‌డున్న భ‌ద్ర‌తా సిబ్బంది.. ఆ కార్య‌క‌ర్త‌ను బ‌య‌ట‌కు లాక్కెళ్లాయి.

665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles