లాన్సింగ్ నగరంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

Fri,September 29, 2017 07:57 PM

bathukamma celebrations in lansing usa

తెలంగాణ పల్లెల్లో పుట్టిన ఉయ్యాల పాటలు ఖండాతరాల్లోనూ మార్మోగాయి. అమెరికాలో మిచిగన్ రాష్ట్రంలొ లాన్సింగ్ నగరంలో తెలంగాణ ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. గ్రేటర్ లాన్సింగ్ తెలంగాణా కమ్యూనిటీ ఆధ్వర్యంలో లాన్సింగ్ లో శనివారం బతుకమ్మ వేడుకను కన్నుల పండువగా నిర్వహించారు. సుమారు వెయ్యి మంది వేడుకలో పాల్గొని బతుకమ్మ ఆడారు. ఉద్యమ గాయని స్వర్ణక్క తన పాటలు, డప్పదరువులతో బతుకమ్మ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ ఆటపాటలు, కోలాట ప్రదర్శనలు కార్యక్రమంలో హైలెట్‌గా నిలిచాయి. గ్రేటర్ లాన్సింగ్ తెలంగాణ కమ్యూనిటీ ప్రతినిది ప్రమొద్ ఎలగందుల బతుకమ్మను ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.

1781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles