కోర్టులో న్యూజిలాండ్ షూట‌ర్‌ వెకిలి న‌వ్వులు..

Sat,March 16, 2019 09:57 AM

Barefoot, handcuffed, New Zealand shooter Brenton smirks in court

క్రైస్ట్‌చ‌ర్చ్‌: న్యూజిలాండ్‌లో మ‌సీదుల్లో కాల్పులు జ‌రిపిన షూట‌ర్ బ్రెంట‌న్ హ్యారిస‌న్ టారెంట్‌ను ఇవాళ క్రైస్ట్‌చ‌ర్చ్ కోర్టులో హాజ‌రుప‌రిచారు. తెల్ల దుస్తుల్లో, చేతుల‌కు బేడీల‌తో ఇద్ద‌రు పోలీసులు అత‌న్ని కోర్టుకు తీసుకువ‌చ్చారు. ఆస్ట్రేలియాకు చెందిన టారెంట్‌.. జాత్యాంహ‌కార ప్ర‌తీకారంతో శుక్ర‌వారం మ‌సీదుల్లో కాల్పులు జ‌రిపాడు. ఆ కాల్పుల్లో 49 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే. కోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో.. ఉన్మాది టారెంట్ వెకిలిగా న‌వ్వుతూ క‌నిపించాడు. ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. అత‌ని త‌ర‌పున లాయ‌ర్ బెయిల్ కోర‌లేదు. అత‌నిపై ఊచ‌కోత‌కు సంబంధించిన కేసుల‌ను న‌మోదు చేయ‌నున్నారు. అయితే మ‌సీదుల్లో జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న వ‌ల్ల సుమారు 9 మంది భార‌తీయుల ఆచూకీ మిస్సైన‌ట్లు దౌత్య‌వేత్త తెలిపారు. ఇద్ద‌రు భార‌తీయులు కూడా మృతిచెందారు.

2604
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles