ఎన్నికల ర్యాలీలో పేలుడు.. మృతిచెందిన మాజీ సీఎం సోదరుడు

Fri,July 13, 2018 06:56 PM

BAP candidate Nawab Siraj Raisani among 25 killed in Mastung blast

క్వెట్టా: పాకిస్థాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పేలుడు జరిగింది. పేలుడు వల్ల సుమారు 25 మంది మృతిచెందారు. ఆ ఘటనలో మృతిచెందినవారిలో బలోచిస్తాన్ అవామీ పార్టీ అభ్యర్థి నవాబ్‌జాదా సిరాజ్ రైసనీ కూడా ఉన్నారు. బాలోచిస్తాన్ మాజీ సీఎం నవాబ్ అస్లమ్ రైసనీ సోదరుడే సిరాజ్. మస్తంగ్‌లోని దరేన్‌ఘర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇదే పేలుడులో మరో 50 మంది గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడ్డవారిని హాస్పటల్‌కు తరలించారు.

1148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles