కాల్పుల‌ నుండి సుర‌క్షితంగా బ‌య‌టప‌డ్డాం: బంగ్లా ఆట‌గాడు

Fri,March 15, 2019 09:09 AM

Bangladesh Cricketers Escape New Zealand Mosque Shooting

వెల్లింగ్టన్‌: న‌్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న బంగ్లాదేశ్ జ‌ట్టుకి అనుకోని సంఘ‌ట‌న ఎదురైంది. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్ టీం మూడో టెస్ట్‌కి స‌మాయ‌త్త‌మ‌వుతుంది. అయితే ఆట‌గాళ్ళు శుక్ర‌వారం రోజు ప్రార్ధ‌న‌ల కోసం అక్క‌డ మ‌జీదుకి వెళ్ళారు. అంత‌లో అక్కడ కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాల్పుల శ‌బ్దం విన్న బంగ్లా ఆట‌గాళ్ళు అక్క‌డి నుండి ప‌రుగులు తీసారు. క్రైస్ట్‌చర్చ్‌ సెంట్రల్‌ సిటీలోని హగ్లీపార్క్‌లో పనిచేసే గన్‌మెన్ ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడని, దీంతో అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. అయితే త‌మ ఆటగాళ్ళంద‌రు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డార‌ని త‌మీమ్ ఇక్బాల్ ట్వీట్ ద్వారా తెలిపాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాల్పుల ఘ‌ట‌న జ‌రిగిన ద‌గ్గ‌రలోనే ఉన్న త‌మ ఆట‌గాళ్ళకి దేవుడి ద‌య వ‌ల‌న ఏం జ‌ర‌గ‌లేద‌ని బంగ్లాదేశ్ కోచ్ పేర్కొన్నారు. అయితే ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించినప్పటికి ప్రాణనష్టం ఎక్కువగానే ఉందని తెలుస్తోంది.
3464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles