అవొకాడో ప్రపోజల్.. ఇప్పుడిదే ట్రెండ్ బాస్!Fri,February 23, 2018 03:06 PM

అవొకాడో ప్రపోజల్.. ఇప్పుడిదే ట్రెండ్ బాస్!

అవొకాడో... ఇదో ఫ్రూట్. తింటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు. కాని... దీన్ని తినకున్నా మరెన్నో ప్రయోజనాలను తీసుకొస్తున్నది. ఏంటి అర్థం కాలేదా. అవొకాడో ప్రపోజల్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న హాష్‌ట్యాగ్ ఇది. సాధారణంగా అమ్మాయికైనా, అబ్బాయికైనా ఎలా లవ్ ప్రపోజ్ చేస్తారు. ఓ రోజా పువ్వు ఇచ్చో.. లేదంటే ఏదైనా గిఫ్ట్ ఇచ్చో ప్రపోజ్ చేస్తారు. కాని.. ఆ ట్రెండ పోయింది బాస్. ఇప్పుడంతా అవొకాడో ప్రపోజలే. ఏంటో అంతా గందరగోళంగా ఉందంటారా? పదండి... కాస్త వివరంగా తెలుసుకుందాం.


సాధారణంగా చేసే ప్రపోజల్ కన్నా.. అవొకాడో ఫ్రూట్‌తో చేసే లవ్ ప్రపోజల్స్‌లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉందట. అవొకాడోను రెండు ముక్కులుగా చేసి దాని లోపల ఓ రింగ్‌ను పెట్టి చేసే లవ్ ప్రపోజలే అవొకాడో ప్రపోజల్. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ ప్రపోజల్‌కే ఎక్కువ యూత్ సై అంటున్నారట. ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన ఓ ఫుడ్ స్టయిలిస్ట్ దీన్ని స్టార్ట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో రింగ్ పెట్టిన అవొకాడో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి ఓ క్యాప్సన్ పెట్టాడు. ఏమంటే.. ఇలా ప్రపోజ్ చేసేవారిని ట్యాగ్ చేయండి అని. అంతే.. ఇక ఇది సోషల్ మీడియా ప్రపంచంలో ఓ విప్లవాన్ని తీసుకొచ్చింది. యూత్‌కు ఈ కొత్త, వింత కాన్సెప్ట్ నచ్చడంతో ఇలా ప్రపోజ్ చేస్తున్నారు. ఇలా ప్రపోజ్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి ఇది కొత్త అనుభూతిని ఇవ్వడంతో పాటు.. ప్రపోజల్‌ను ఒప్పుకొనే అవకాశాలే ఎక్కువగా ఉంటాయట. అది సంగతి.. మీరు కూడా ఎవరికైనా లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ప్రొసీడ్ విత్ అవొకాడో అండ్ బెస్ట్ ఆఫ్ లక్.

2294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS