క్యాసినోలో కాల్పులు.. 36 మంది మృతి

Fri,June 2, 2017 04:07 PM

మ‌నీలా : పిలిప్పీన్స్‌లో ఓ ఆగంతుడు బీభ‌త్సం సృష్టించాడు. రాజ‌ధాని మ‌నీలాలో ఉన్న ఓ క్యాసినోపై విరుచుకుప‌డ్డాడు. తుపాకీతో క్యాసినోలోని ప్ర‌వేశించిన అత‌ను కాల్పులు జ‌రిపాడు. అక్క‌డ ఉన్న టేబుళ్ల‌కు నిప్పుపెట్టాడు. దీంతో క్యాసినోలో పెను ప్ర‌మాదం జ‌రిగింది. భారీ స్థాయిలో మంట‌లు చెల‌రేగాయి. ద‌ట్ట‌మైన పొగ క‌మ్ముకుపోయింది. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 36 మంది చ‌నిపోయిన‌ట్లు అధికారులు గుర్తించారు. క్యాసినో, హోట‌ల్ కాంప్లెక్స్ నుంచి ఆ మృత‌దేహాల‌ను వెలికితీశారు.తుపాకీతో క్యాసినోల‌కు ఎంట‌ర్ అయిన వ్య‌క్తి ఏ దేశ‌స్థుడో ఇంకా గుర్తుప‌ట్ట‌లేదు. మొద‌ట ఎవ‌రూ చ‌నిపోలేదు అని అధికారులు భావించారు. కానీ క్యాసినోను సాయుధ పోలీసులు స్వాధీనం చేసుకున్న త‌ర్వాత అక్క‌డ ఉన్న మృత‌దేహాలను గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌ను పోలీసులు ఓ దొంగ‌త‌నం కేసుగా భావిస్తున్నారు. కానీ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు మాత్రం అది త‌మ ప‌నే అని పేర్కొన్న‌ది. గురువారం అర్థ‌రాత్రి అజాల్ట్ రైఫిల్‌తో క్యాసినోలో ప్ర‌వేశించిన ఆగంత‌కుడు ఈ బీభ‌త్సం సృష్టించాడు.


వాస్త‌వానికి ఆ దుండ‌గుడు త‌న గ‌న్‌తో గాలిలో కాల్పులు జ‌రిపాడు. ఆ భ‌యంతో జ‌నం ప‌రుగులు తీశారు. దాంతో తొక్కిస‌లాట జ‌రిగి జ‌నం చ‌నిపోయిన‌ట్లు తెలుస్తున్న‌ది. క్యాసినోకు నిప్పుపెట్టిన ఆగంత‌కుడు అక్క‌డ ఉన్న మూడు మిలియ‌న్ల విలువైన గ్యాంబ్లింగ్ చిప్స్ తీసుకెళ్లాడు. అయితే ఆ త‌ర్వాత ఫైరింగ్‌కు పాల్ప‌డిన వ్య‌క్తి త‌న‌కు తాను నిప్పుపెట్టుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు రిసార్ట్స్ వ‌ర‌ల్డ్ మ‌నీలా ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

1128
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles