మునిగిన మిలిట‌రీ షిప్‌, 34 మంది గల్లంతుMon,July 17, 2017 03:13 PM
మునిగిన మిలిట‌రీ షిప్‌, 34 మంది గల్లంతు

యౌండి: ఆఫ్రికాలోని కెమెరూన్ దేశంలో పెను విషాదం చోటుచేసుకున్న‌ది. ర‌క్ష‌ణ‌శాఖ‌కు చెందిన మిలిట‌రీ నౌక అట్లాంటిక్ స‌ముద్రంలో మునిగింది. ఈ ఘ‌ట‌నలో 34 మంది గ‌ల్లంతు అయిన‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు సైన్యాధికారి జోసెఫ్ బెటి అసోమో ఆదేశాలు జారీ చేశారు. హెలికాప్ట‌ర్ల ద్వారా ముగ్గురు సైనికుల‌ను ర‌క్షించారు. ఇంకా గాలింపులు కొన‌సాగుతున్నాయి. దుర్ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో షిప్‌లో సుమారు 37 మంది ఉన్న‌ట్లు సైనికాధికారి తెలిపారు. బాకాసీ ద్వీపానికి వెళ్తున్న స‌మ‌యంలో షిప్ మునిగిపోయింది. చ‌మురు నిక్షేపాలు అధికంగా ఉండే బాకాసిని నైజీరియా అంత‌ర్జాతీయ కోర్టు ఆదేశాల మేరుకు కెమెరూన్‌కు అప్ప‌గించింది.

1069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS