ప్రార్థనా మందిరంలో కాల్పులు : ఆరుగురు మృతి

Fri,March 15, 2019 09:53 AM

Assailants in Military dress before fire in newzealand today

న్యూజిలాండ్ : క్రిస్ట్ చర్చ్ వద్ద కాల్పులకు తెగబడిన దుండగుల కోసం న్యూజిలాండ్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. న్యూజిలాండ్ లో జనాలు రద్దీగా ఉండే రెండు మసీదు ప్రాంతాల్లో దుండగులు కాల్పులకు తెగబడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దుండగులు మిలటరీ దుస్తుల్లో వచ్చి ఈ కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలెవరూ ప్రార్థనా స్థలాలకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీచేశారు.

కాల్పుల ఘటనపై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశానికి ఇది ఒక చీకటి రోజని అన్నారు. కాల్పులు జరిపిన ఓ దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఓ దుండగుడు మసీదులోకి చొరబడి కాల్పులు జరిపిన ఘటనను లైవ్ లో షూట్ చేసి..దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా..పలువురికి గాయాలయినట్లు స్థానిక మీడియా కథనంలో వెల్లడించింది. కాల్పులతో ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది. న్యూజిలాండ్ పోలీసులు శాంతి భద్రతలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తం అయ్యారు. కాల్పుల నేపథ్యంలో సెంట్రల్ సిటీ భవనాలు, సెంట్రల్ లైబ్రరీ, ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

డీన్స్ ఏవ్ మసీదులో ప్రార్థనలు చేస్తుండగా కాల్పులు శబ్దం విన్నా. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే నా భార్య ఫుట్ పాత్ పై రక్తపు మడుగులో పడి ఉందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పిల్లలపై కాల్పులు జరుపుతుండగా చూశానని మరో వ్యక్తి అన్నారు. కాల్పుల ఘటనా స్థలంలో ఉన్న మరో వ్యక్తి రేడియో స్టేషన్ కు ఫోన్ చేసి..తాను కాల్పుల శబ్దం విన్నానని, నలుగురు వ్యక్తులు రక్తపు మడుగులో ఉన్నారని చెప్పారు. ఎక్కడ చూసినా రక్తపాతమే కనిపిస్తుందని చెప్పారు.

1608
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles