మీరు మ్యాథ్స్‌లో జీనియసా? దీన్ని సాల్వ్ చేయండి చూద్దాం!

Thu,November 30, 2017 05:24 PM

Are you a math genius then try this puzzle

చాలా మందికి మ్యాథ్స్ అంటేనే పడదు. కాని.. కొంతమందికి మ్యాథ్స్ అంటేనే వల్లమాలిన ప్రేమ ఉంటుంది. అటువంటి వాళ్లకే ఈ ప్రశ్న. మీ మెదడుకు కాస్త మేత వేయండి.. తుప్పు పట్టిన మీ మెదడుకు కాస్త పదును పెట్టండి. పైన చూస్తున్నారుగా ఫోటోను. ఆ ఫోటో ఉన్న పజిల్‌కు సమాధానం చెప్పండి. దీన్ని చైనాకు చెందిన పీపుల్స్ డెయిలీ పత్రిక తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అంతే కాదు.. ఆ పజిల్‌కు ఓ హింట్ కూడా ఇచ్చింది. ఆ హింట్ ఏంటో పీపుల్స్ డెయిలీ చేసిన ట్వీట్‌లో మీరు గమనించవచ్చు. సరే.. ముందైతే కాస్త ఈ పజిల్ మీద దృష్టి పెట్టండి.ఏమైంది... ట్రై చేశారా.. ? ఆన్సర్ వచ్చిందా లేదా? సరే.. మీ సమాధానం ఎంతో గుర్తుంచుకోండి. దాని కరెక్ట్ ఆన్సర్ ఎంతో, ఎందుకో ఇప్పుడు చర్చించుకుందాం. మీకు సమాధానం 16 వస్తే మీ బుర్ర సూపర్ కంప్యూటర్ అంత ఖచ్చితంగా పని చేస్తున్నట్టే లెక్క. లేదంటే మాత్రం మీరు మీ మెదడును ఇంకా పదును పెట్టాల్సిందే. 16 కాకుండా చాలా మందికి వచ్చే ఆన్సర్ 30. ఇంకా కొంతమంది +, * దగ్గర కాస్త కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే దాన్ని బోడ్మాస్ రూల్ ప్రకారం సాల్వ్ చేయాల్సి ఉంటుంది.


అయితే... దీని అసలు మర్మం ఏంటంటే... మీరు అనుకున్నట్టే ఒక్క షూ వాల్యూ 10. బొమ్మ వాల్యూ 5, రెండు విజిల్స్ వాల్యూ 4. కాని మీరు సాల్వ్ చేయాల్సిన లాస్ట్ లైన్ పజిల్‌లో ఉన్న షూ వాల్యూ 10. ఓకే.. కాని పైన ఉన్న బొమ్మ మెడలో ఒక విజిల్ ఉండేది. కాని.. ఇక్కడ ఉన్న బొమ్మ మెడలో విజిల్ లేదు. అంటే రెండు విజిల్స్ వాల్యూ 4 అంటే.. ఒక్క విజిల్ వాల్యూ 2. సో... బొమ్మ వాల్యూ - ఒక్క విజిల్ వాల్యూ (5-2) = 3, తర్వాత ఒకే విజిల్ ఉంది. అంటే 2... మొత్తం కలిపితే.. బోడ్మాస్ రూల్ ప్రకారం 3*2 = 6, 10+6=16. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇంత మతలబు ఉంది ఈ చిన్న పజిల్‌లో.


ట్రిక్కీగా ఉన్న ఈ పజిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపుతున్నది. నెటిజన్లంతా పేపరు, పెన్ను తో స్వారీ చేస్తూ... దీన్ని సాల్వ్ చేస్తూ... వాళ్లకు వచ్చిన ఆన్సర్లను.. వాళ్లు ట్రై చేసిన పద్ధతిని కామెంట్ చేస్తున్నారు.
7626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles