ట్రంప్ జెరుసలేం ప్రకటనపై నిరసనలు

Thu,December 7, 2017 11:24 AM

Arab countries found fault with Donald Trumps Jerusalem decision

రియాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ముస్లిం దేశాలు అతలాకుతలమవుతున్నాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్.. ఆరు ముస్లిం దేశాల వలసవాదులపై నిషేధం విధించారు. తాజాగా ఇజ్రాయిల్ రాజధాని జెరుసలేం అని ట్రంప్ ప్రకటించడంతో అరబ్ దేశాలు ఊగిపోతున్నాయి. జెరుసలేంపై డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. దీనిపై గల్ఫ్ కింగ్‌డమ్ ఓ ప్రకటన కూడా జారీ చేసింది. ట్రంప్ ప్రటకన అర్థరహితంగా, బాధ్యతారహితంగా ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యూ మాత్రం ఆ ప్రకటనను చరిత్రాత్మకం అని వర్ణించారు. ఒకే ఒక ప్రకటనతో అమెరికా విదేశీ విధానాన్ని ట్రంప్ మార్చేశారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్న 15 సభ్యదేశాలు ట్రంప్ ప్రకటనపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాయి.
ట్రంప్ ప్రకటన చేయకముందే గాజాలో ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ట్రంప్ నరకానికి ద్వారం తెరిచారని ఇస్లామిస్ట్ హమాస్ సంస్థ ఓ ప్రటకన చేసింది. ఇస్తాంబుల్‌లోని అమెరికా ఎంబసీ ముందు కూడా భారీ ప్రదర్శన చేపట్టారు. అమెరికా తన వైఖరిని అకస్మాత్తుగా మార్చుకున్నదని సౌదీ రాయల్ కోర్టు అభిప్రాయపడింది. ముస్లింల పట్ల అమెరికా వ్యక్తం చేస్తున్న నిర్ణయాలను ఖండించాలని మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యూ... తాజా ప్రకటన పట్ల ట్రంప్‌కు థ్యాంక్స్ తెలిపారు. జెరసలేం ఎప్పటికీ మా రాజధాని అని మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ స్పష్టం చేశారు. వివిధ ప్రపంచ దేశాలు కూడా భిన్నంగా స్పందించాయి.
జెరుసలెంపై ఇండియా మాట ఇదీ!
ఇజ్రాయెల్ రాజధానిగా జెరుసలెంను గుర్తిస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. మధ్య ప్రాచ్య దేశాల్లో ఈ నిర్ణయం వల్ల మరోసారి అశాంతి నెలకొంటుందని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఈ కీలక అంశంపై ఇండియా కూడా తన వైఖరిని వెల్లడించింది. పాలస్తీనాపై తమ వైఖరి స్వతంత్రంగానే ఉంటుంది తప్ప.. మరో దేశం దీనిని నిర్ణయించలేదని స్పష్టంచేసింది. పాలస్తీనా విషయంలో మా వైఖరి నిలకడగా ఉంటుంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే నిర్ణయం తీసుకుంటాం తప్ప దీనిపై మరో దేశ ప్రభావం ఉండదు అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. ఇజ్రాయెల్ రాజధానిగా వివాదాస్పద జెరుసలెంను గుర్తిస్తున్నామని, అమెరికా ఎంబసీని కూడా టెల్ అవివ్ నుంచి జెరుసలెంకు మారుస్తామని బుధవారం ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మిడిల్ ఈస్ట్‌లోని అరబ్బులు, ముస్లింలు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.

2849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS