అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ నేషనల్ కన్వెన్షన్

Tue,September 11, 2018 12:58 PM

APTA National Convention 2018 in America

హైదరాబాద్ : "మానవ సేవయే మాధవ సేవ" అనే సిద్ధాంతాన్ని నమ్మి ఆప్త(అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్)సంస్థను 2008 సంవత్సరములో స్థాపించి ఇప్పటికి ఒక దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భములో ఆప్త సంస్థ మొట్టమొదటి సారిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిన్చ తగినట్లుగా ఆప్త నేషనల్ కన్వెన్షన్ ఈ 2018 సంవత్సరం ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 2 వరకు 3 రోజుల పాటు 10వ వార్షికోత్సవాన్ని అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రములోని బాల్టీమోర్ పట్టణము నడిబొడ్డులో ఉన్న జోసెఫ్ మెయిర్హోఫ్ సింఫనీ హాల్ నందు ఘనంగా నిర్వహించడమైనది. ఈ ఆప్త నేషనల్ కన్వెన్షన్ కొరకు భారీ ఏర్పాట్లు చెయ్యటం జరిగినది.

ఈ జాతీయ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని విచ్చేసిన 4000 మంది తెలుగు వారు అందరికి ఆప్త కన్వెన్షన్ టీం తరుపున ఆప్త బోర్డు చైర్ శ్రీమతి రాధిక నైగాపుల, ఆప్త ప్రెసిడెంట్ గోపాల గూడపాటి, ఆప్త కన్వెన్షన్ 2018 కన్వీనర్ ధీరజ్ ఆకుల, కన్వీనర్స్ నటరాజు ఇల్లూరి, రెడ్డియ్య ప్రత్తిపాటి, శ్రీనివాస్ సిద్ధినేని, లలిత బైరా, ఆప్త ఫౌండర్స్ ప్రసాద్ సమ్మెట, శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమట మరియు కన్వెన్షన్ కమిటీ సెక్రటరీ ఆనంద్ జవ్వాజి, సభ్యులు వీరబాబు ప్రత్తిపాటి, రాజ్ సిరిగిరి, శివ యర్రంశెట్టి, మధు దాసరి, రవీంద్రనాథ్ కొట్టే, రవి ముళ్ళపూడి, కిషోర్ ముత్యాల, రాజేష్ అంకం, ప్రవీణ్ అండపల్లి, బోర్డు సెక్రటరీ శివ కొప్పరాతి, జనరల్ సెక్రటరీ శౌరి ప్రసాద్ కొచ్చెర్ల, ఇతర కన్వెన్షన్ కమిటీ సభ్యులు శుభాభినందనలు తెలిపారు.

శ్రీ శ్రీనివాస కళ్యాణముతో మొదలైన కన్వెన్షన్ దిగ్విజయముగా రెండు రోజులు సాగింది. పెద్దలు మరియు పిల్లల యొక్క సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఎస్వీఆర్ శత జయంతి ఉత్సవాలు ఆప్త కన్వెన్షన్ వేదిక పైన మొట్ట మొదటి సారిగా అమెరికాలో రంగ రంగ వైభవముగా జరిగినవి. ఈ సందర్భముగా ఎస్వీఆర్ సిల్వర్ కాయిన్ ని ఆప్త వేదిక పైన ఆవిష్కరించి, ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ మరియు అనంత శ్రీరామ్ రచించిన అద్భుతమైన ఎస్వీఆర్ పైన పాటను, ఆప్తవాణి సౌవెనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించడమైనది. శ్రీ సుబ్బు కోట గారికి ఆప్త లైఫ్టైమ్ అచివ్మెంట్ అవార్డుని ప్రదానము చేయడం జరిగింది. మేరీల్యాండ్ సెక్రటరీ అఫ్ స్టేట్ శ్రీ. జాన్ సి. వబెన్స్మిత్ శ్రీ రఘుపతి వెంకయ్యనాయుడు ఆప్త అవార్డు ని శ్రీ అల్లు అరవింద్ గారికి ప్రదానం చేసి ఘనముగా సత్కరించడమైనది. ఆప్త శ్రీ దాసరి అరుణ్ కుమార్, శ్రీ రవణం స్వామి నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ తులసి రామచంద్ర ప్రభు, ప్రముఖ సాహితివేత్త శ్రీ యర్రంశెట్టి సాయి, ప్రముఖ గాయకుడు శ్రీ జి ఆనంద్, ప్రముఖ టీటీ ప్లేయర్ శ్రీ ఉమేష్ ఆచంటలను ఘనముగా ఆప్త వేదికపైన సత్కరించడమైనది. రుచికరమైన తెలుగింటి విందు భోజనాలు ఆహూతులకు వడ్డించడమైనది.

ఆప్తా పది వసంతాలు పూర్తి చేసుకున్న మైలురాయి సందర్భంగా జరిగిన ప్రపంచ మహాసభలను విజయవంతం చేయడానికి ప్రముఖ రాజకీయ నేతలు పల్లం రాజు, కన్నా లక్ష్మి నారాయణ, బొత్సా సత్యనారాయణ, సి రామచంద్రయ్య, కదిరి బాబు రావు, పి విజయ బాబు, రత్నం ముత్యాల, కృష్ణ రావు ముత్తంశెట్టి, దిలీప్ బైరా, రత్నాకర్ పండుగాయల, సామినేని ఉదయ భాను, వేణు గోపాల రావు విచ్చేసారు.

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్, ఫ్లూట్ నాగరాజు పెర్ఫార్మెన్స్, కౌశిక్ బాబు అభినయం, శ్రుతకీర్తి నాట్యం, విభా ఫ్యాషన్స్ అధినేత్రి శ్రీమతి వినయ గోపిశెట్టి ఆధ్వర్యములో శ్రీమతి సంధ్య బయిరెడ్డి కోరియోగ్రఫీ లో ఫాషన్ షోస్ మరియు పిన్నలు, పెద్దలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.

640
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS