యాపిల్ స్టోర్‌లో చోరీ.. సెకన్ల వ్యవధిలో ప్రొడక్ట్స్ కాజేశారు.. వీడియో..!

Wed,July 11, 2018 07:20 PM

Apple Store Robbed in California and Thieves Grab Products

కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలోని యాపిల్ స్టోర్‌లోకి చొరబడిన నలుగురు వ్యక్తులు 27వేల డాలర్ల విలువైన యాపిల్ ప్రొడక్ట్స్‌ను సెకన్ల వ్యవధిలోనే చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించారు. ఈ నెల 7వ తేదీన కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో ఉన్న ఫ్యాషన్ ఫెయిర్ మాల్‌లోని యాపిల్ స్టోర్‌లోకి ఉదయాన్నే నలుగురు వ్యక్తులు చొరబడ్డారు. వారంతా ముఖాలు కనిపించకుండా హుడ్స్‌తో కూడిన జాకెట్లను వేసుకున్నారు. అనంతరం స్టోర్‌లోకి వేగంగా వచ్చి తమకు దొరికిన యాపిల్ ప్రొడక్ట్స్‌ను దొరికినట్లు జాకెట్లలో వేసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటనతో స్టోర్‌లో ఉన్న కస్టమర్లే కాకుండా సిబ్బంది కూడా నివ్వెరపోయారు.

చోరీకి గురైన యాపిల్ ప్రొడక్ట్స్ మొత్తం విలువ 27వేల డాలర్ల (సుమారుగా రూ.18.57 లక్షలు) వరకు ఉంటుందని తెలిసింది. ఇక చోరీకి పాల్పడిన నలుగురు వ్యక్తులతోపాటు స్టోర్ బయట వాహనంలో వేచి ఉన్న మరో వ్యక్తి కలిపి ఆ ఐదుగురి వయస్సు 16 నుంచి 18 సంవత్సరాల లోపే ఉంటుందని ఫ్రెస్నో పోలీసులు తెలిపారు. చోరీకి గురైన ప్రొడక్ట్స్‌లో యాపిల్ మాక్‌బుక్‌లు, ఐఫోన్ 6, 7, 8, ఐఫోన్ X లు కూడా ఉన్నాయని అన్నారు. కాగా చోరీ జరిగిన సమయంలో స్టోర్‌లో ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఆ దృశ్యాలు ఉన్న వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది.


3489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS