వీడియో: బోటుపై ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి!

Sat,January 20, 2018 02:37 PM

Antarctic Researchers surprised by unexpected guest in the middle of the sea

ఎప్పుడైనా ఇంటికి అనుకోని అతిథి వస్తే ఏం చేస్తాం. ముందుగా షాక్ అవుతాం. తర్వాత తీరిగ్గా ముచ్చట్లు చెప్పుకుంటాం. ఇలాగే అంటార్కిటిక్ సముద్రాన్ని రీసెర్చ్ చేసే రీసెర్చర్లకు అనుకోని అతిథి ఎదురయింది. రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం అంటార్కిటిక్ సముద్రంలో నీటి సాంపిల్స్‌ను తీసుకోవడం కోసం బోటులో ప్రయాణిస్తుండగా.. సముద్రంలో ఉన్న ఐసుగడ్డల కింద ఉన్న నీటిలోపలి నుంచి సడెన్‌గా ఓ పెంగ్విన్ బోటు మీదికి దూకింది. క్షణంలో బోటు మీద ఉన్న వస్తువులన్నింటినీ ఓ సారి చూసి అక్కడి నుంచి తుర్రుమన్నది. ఇక.. ఈ తతంగాన్నంతా బోటులో ఉన్న ఓ రీసెర్చర్ తన కెమెరాలో బంధించాడు. తర్వాత దాన్ని అంటార్కిటిక్ డివిజన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయింది.


2777
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles