10 లక్షల విలువైన వజ్రాన్ని ఎత్తుకెళ్లిన చీమ.. వీడియో

Sun,August 12, 2018 03:55 PM

Ant steals 10 lakh worth diamond from jewellery store video goes viral

చీమ ఎంతొ చిన్నది.. పనిలొ ఎంతొ మిన్నది.. ముందు చూపు ఉన్నది.. పొదుపులోన మిన్నది.. అని పెద్దలు ఊరికే అనలేదు. లేకపోతె ఏంటి. ఓ చీమ. మనం రోజూ కాళ్ల కింద నలిపేసే ఆ చిట్టి చీమ ఏకంగా 10 లక్షల రూపాయల విలువైన వజ్రాన్ని ఎత్తుకెళ్లింది. ఈ ఘటన ఓ జ్యూయలరీ షాపులో జరిగింది. షాపు యజమాని వజ్రాలన్నింటినీ ఓ కాగితంలో వేసి లెక్కిస్తున్నాడట. ఇంతలో ఓ చీమ ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు కాని.. వెంటనే అక్కడికి వెళ్లి ఆ వజ్రాల్లో ఒకదాన్ని అందుకొని తెగ ఆయాసపడుతూ దాన్ని మోసుకెళ్తున్నదట. ఇక.. ఆ చీమ వజ్రాన్ని ఎత్తుకెళ్లడాన్ని గమనించిన ఆ వ్యక్తి వెంటనే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవడమే కాదు.. చీమపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. తన గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేయడానికే ఆ చీమ వజ్రాన్ని ఎత్తుకెళ్లిందేమో అని కొందరు.. వామ్మో.. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని మరికొందరు కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ చీమ వజ్రాన్ని ఎలా ఎత్తుకెళ్లిందో చూడాలని ఉందా? అయితే ఈ వీడియో చూసేయండి మరి..

9685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles