ట్రంప్ సెక్యూరిటీలో తొలి సిక్కు వ్యక్తి ఇతడు!

Wed,September 12, 2018 05:04 PM

Anshdeep Singh Bhatia becomes first Sikh person to be in Donald Trump Security team

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెక్యూరిటీ టీమ్‌లో చోటు సంపాదించిన తొలి సిక్కు వ్యక్తిగా నిలిచాడు లుధియానాలో పుట్టిన అన్ష్‌దీప్ సింగ్ భాటియా. కఠినమైన శిక్షణ తర్వాత అతన్ని గత వారం ట్రంప్ సెక్యూరిటీ టీమ్‌లో నియమించారు. 1984 సిక్కుల ఊచకోత సమయంలో అన్ష్‌దీప్ కుటుంబం కాన్పూర్ నుంచి పంజాబ్‌లోని లుధియానాకు వలసవెళ్లింది. ఈ దాడుల్లో అతని కుటుంబ సభ్యులు కూడా మరణించారు. అతని తండ్రి దేవేంద్ర సింగ్ కూడా ఈ దాడుల్లో గాయపడ్డాడు. అతనికి మూడు బుల్లెట్ గాయాలయ్యాయి. ఆ తర్వాత లుధియానాకు వలస వెళ్లిన తర్వాత దేవేంద్ర సింగ్ ఫార్మాసూటికల్ బిజినెస్ ప్రారంభించారు. 2000వ సంవత్సరంలో వీళ్లు అమెరికాకు వలస వెళ్లారు. ఆ సమయంలో అన్ష్‌దీప్ వయసు పదేళ్లు. అధ్యక్షుడి సెక్యూరిటీ టీమ్‌లో ఉండాలన్నదే తన లక్ష్యంగా పెట్టుకున్న అన్ష్‌దీప్.. మొత్తానికి అనుకున్నది సాధించాడు.

4288
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles