భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

Tue,October 8, 2019 05:18 PM

స్టాక్‌హోం: 2019 సంవత్సరానికి భౌతికశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. భౌతికశాస్త్రంలో నోబెల్‌ విజేతలను నోబెల్‌ కమిటీ మంగళవారం ఎంపిక చేసింది. భౌతికాంశాలపై పరిశోధనలకు కెనడియన్‌ అమెనికన్‌ జేమ్స్‌ పీబుల్స్‌ను, సూర్యుడిని పోలివుండే నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహం కనుగొన్నందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన మైఖేల్‌ మేయర్‌, డైడియర్‌ క్యూలోజ్‌లను సంయుక్తంగా అవార్డుకు ఎంపిక చేశారు. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంలో ఈ ఏడాది డిసెంబర్‌ 10న జరగనున్న పురస్కార వేడుకలో వీరికి నోబెల్‌ బహుమతి అందజేయనున్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతిఏటా నోబెల్‌ పురస్కారాలను అందజేస్తుంటారు.

1431
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles