మూగ‌జీవాల‌ను విమానాల్లో త‌ర‌లించి హీరోల‌య్యారు!

Fri,September 8, 2017 02:03 PM

Animals displaced from Houston by plane which was hit by Harvey Hurricane recently

హౌస్ట‌న్: యూఎస్ ను కొన్ని రోజుల కింద హార్వే తుపాను వ‌ణికించిన సంగ‌తి తెలిసిందే. దీంతో హౌస్ట‌న్, టెక్సాస్ న‌గ‌రాలు స‌ర్వ నాశ‌న‌మ‌య్యాయి. వ‌ర‌ద‌ల్లో ఎంతో మంది కొట్టుకుపోయారు. చాలా మంది ఇండ్లు కూడా కొట్టుకుపోయాయి. దీంతో వేల మంది నిరాశ్ర‌యుల‌య్యాయి. ఇక‌.. త‌మ‌కే దిక్కులేక‌పోవ‌డంతో వాళ్లు పెంచుకునే పెట్స్ ను న‌డి రోడ్డు మీద వ‌దిలేశారు కొంత‌మంది. దీంతో మూగ‌జీవాలు దిక్కు తోచ‌ని స్థితిలో రోడ్డున ప‌డ్డాయి.అయితే.. వ‌ర‌ద‌లు కొంచెం త‌గ్గాక కొన్ని ఆర్గ‌నైజేష‌న్లు టెక్సాస్, హౌస్ట‌న్ లో నిరాశ్ర‌యులైన వ్య‌క్తుల‌కు వ‌స‌తులు క‌ల్పించాయి. దానిలో భాగంగానే కొన్ని ఆర్గ‌నైజేష‌న్లు నోరు లేని జీవాల‌కు కూడా ఆశ్ర‌యం క‌ల్పించ‌డానికి ముందుకు వ‌చ్చాయి. అక్క‌డ చిక్కుకుపోయిన పిల్లులు, కుక్క‌ల‌ను ప్ర‌త్యేక విమానంలో కాలిఫోర్నియాలోని సాన్ డియెగో కు త‌ర‌లించారు.


గురువారం దాదాపు 64 పెట్ యానిమ‌ల్స్ ను హెలెన్ వుడ్ వార్డ్ యానిమ‌ల్ సెంట‌ర్ కు చెందిన వాళ్లు ప్ర‌త్యేక విమానంలో సాన్ డియెగో కు త‌ర‌లించారు. వాటిని అక్కున చేర్చుకొని విమానంలో త‌ర‌లించి వాటికి ఓ గూడు క‌ల్పించిన ఆర్గ‌నైజ‌న్ల‌కు నెటిజ‌న్లు బ్ర‌హ్మ‌ర‌థం పడుతున్నారు. ఈ జంతువుల‌ను విమానంలో త‌ర‌లిస్తున్న వీడియో, ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నారు. దీంతో.. నెటిజ‌న్లు వాళ్ల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. నిజ‌మైన హీరోలుగా వారిని అభివ‌ర్ణిస్తున్నారు.


1995
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS