ఖడ్గమృగానికి కోపమొస్తే..ఈ వీడియో చూడండి

Thu,August 29, 2019 07:15 PM

Angry rhino attacks flips car at park in Germany


అది జర్మన్ హొడెన్ హాగన్ పార్కు. జూ కీపర్ సఫారీ రైడ్ లో భాగంగా కారులో వస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా రైనో (ఖడ్గమృగం) ఆ కారు వైపు వచ్చింది. రైనో కోపంతో ఊగిపోతూ తన కొమ్ముతో కారును పల్టీలు కొట్టించింది. రైనో ఆ కారును కొమ్ముతో పైకి లేపి ముందుకు తోస్తూ రెండుమూడు సార్లు దొర్లించింది. జూ కీపర్ ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడింది. జూ కీపర్ 25 ఏళ్ల నుంచి ఈ పార్కులో పనిచేస్తోంది. చాలా అనుభవమున్న వ్యక్తి. త్వరలోనే కోలుకుని మళ్లీ విధుల్లో చేరుతుందని పార్కు మేనేజర్ ఫాబ్రిజో సెఫె తెలిపారు.

రైనో కారును పల్టీలు కొట్టించిన దృశ్యాలను ఓ సందర్శకుడు సెల్ ఫోన్ లో వీడియో తీసి పేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. సంతానోత్పత్తి కార్యక్రమంలో భాగంగా 30 ఏళ్ల వయస్సున్న ఈ రైనోను 18 నెలల క్రితం హొడెన్ హాగన్ పార్కుకు తీసుకొచ్చారు. మరీ రైనో ఎందుకు ఇలా ఆగ్రహంతో ఊగిపోయిందో తెలియలేదు. రైనో వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.

4513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles