వీడియో: కదులుతున్న బస్సు నుంచి డ్రైవర్‌ను లాగేశాడు!

Sat,January 20, 2018 04:21 PM

Angry commuter drags driver off moving bus in china

ఓ ప్రయాణికుడికి, బస్సు డ్రైవర్‌కి మధ్య జరిగిన వాగ్వాదం చాలా దూరం వెళ్లింది. డ్రైవర్‌పై చిర్రెత్తిన ప్రయాణికుడు డ్రైవర్‌ను బస్సు నడుపుతుండగానే బయటికి గుంజి బస్సు నుంచి బయటకు లాగేశాడు. ఇక.. డ్రైవర్‌ను బయటికి లాగినా.. బస్సు ముందుకు వెళ్తుండటంతో భయపడ్డ ఇతర ప్రయాణికులు వెంటనే బస్సు దిగడం ప్రారంభించారు. ఇంతలో డ్రైవర్ బస్సు ఎక్కి బస్సును ఆపేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన అంతా బస్సులో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటన చైనాలోని హైనన్ ప్రావిన్స్‌లో ఉన్న సన్యా సిటీలో జరిగింది. అయితే.. ప్రయాణికుడు బస్సును ఆపాలని చెప్పిన చోట డ్రైవర్ బస్సును ఆపలేదట. దీంతో నిప్పులు చెరిగిన ప్రయాణికుడు డ్రైవర్‌ను బస్సు నుంచి బయటికి లాగడంతో ఈ గొడవ పెరిగి పెద్దదయింది. ఇక.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది.

3950
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles