అండమాన్ యాత్రికులంతా క్షేమం..

Sun,December 16, 2018 03:31 PM

Andaman islands Stranded tourists on being moved to safety

పోర్ట్ బ్లెయిర్ : అండమాన్ లోని హావ్ లాక్, నీల్ దీవుల్లో చిక్కుకున్న యాత్రికులంతా క్షేమంగా ఉన్నారు. భారత కోస్ట్ గార్డ్ బృందం, నేవీ, అండమాన్ నికోబార్ అధికారుల టీం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి..శుక్రవారం నుంచి రెండు దీవుల్లో చిక్కుకుపోయిన యాత్రికులకు సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చామని డీజీపీ దీపేంద్రపాఠక్ వెల్లడించారు. వాయుపీడనం వల్ల అండమాన్ పశ్చిమ ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడటంతో.. పోర్ట్ బ్లెయిర్ కు 30-40 నాటికల్ మైళ్ల దూరంలో పర్యాటకులు మార్గమధ్యలో చిక్కుకున్నారు. శనివారం వాతావరణం అనుకూలించడంతో సహాయక చర్యలు చేపట్టి ఆదివారం ఉదయం 1100 మంది యాత్రికులను సురక్షత ప్రాంతానికి తీసుకువచ్చామని తెలిపారు.

1239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles