నైకీ వస్తువులను తగులబెడుతున్న అమెరికన్లు.. ఎందుకో తెలుసా?

Wed,September 5, 2018 01:35 PM

Americans burning Nike things in protest of their new ad

న్యూయార్క్: ప్రముఖ క్రీడావస్తువుల తయారీ సంస్థ నైకీపై అమెరికన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ బ్రాండ్ వస్తువులు కనిపిస్తే చాలు తీసుకెళ్లి తగులబెడుతున్నారు. ఇన్వెస్టర్లు తమ షేర్లు అమ్ముకుంటున్నారు. అసలు నైకీ మొత్తాన్నే నిషేధించాలని మరికొందరు ఆందోళనలు చేస్తున్నారు. దీనికంతటికీ కారణం ఆ సంస్థ చేసిన కొత్త యాడ్. ఈ కొత్త ప్రకటనలో నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) స్టార్ కొలిన్ కేపర్‌నిక్ నటించాడు. అయితే ఆ యాడ్‌లో అమెరికా జాతీయ గీతం వస్తున్న సమయంలో కేపర్‌నిక్ మోకాళ్లపై కూర్చున్నట్లుగా చూపించడం అమెరికన్ల ఆగ్రహానికి కారణమైంది. ఇదో దారుణమైన సందేశమిచ్చే ప్రకటన అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ యాడ్ చూసినప్పటి నుంచీ అమెరికన్లు నైకీ వస్తువుల తగులబెడుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ నిరసన తెలుపుతున్నారు.


అయితే ఈ నిరసనలు కూడా తమకు ఒక విధంగా మేలు చేసేదే అని నైకీ భావిస్తుండటం మరో విశేషం. ఈ గొడవ మొదలైన తర్వాత నైకీ షేరు విలువు 4 శాతం వరకు పడిపోయినా.. ఆ బ్రాండ్ పేరు మరింత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లడంపై కంపెనీ సంతృప్తి వ్యక్తంచేసింది. 24 గంటల్లోనే నైకీ పేరును 27 లక్షల సార్లు సోషల్ మీడియాలో ప్రస్తావించడం విశేషం. ఈ యాడ్‌లో కనిపించినప్పటి నుంచీ కేపర్‌నిక్‌ను ఎన్‌ఎఫ్‌ఎల్‌లో ఏ టీమ్ కూడా తీసుకోలేదు. అతడు ఈ సీజన్‌లో కూడా ఖాళీగానే ఉన్నాడు. మరోవైపు నైకీ వ్యతిరేక ప్రచారానికి సెరెనా విలియమ్స్, లెబ్రాన్ జేమ్స్, కెవిన్ డ్యూరాంట్, క్రిస్ పాల్‌లాంటి స్టార్ అథ్లెట్లు మద్దతు తెలిపారు.

6347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles