మమ్మల్నే విచారిస్తారా.. క్రిమినల్ కోర్టుకు వార్నింగ్

Tue,September 11, 2018 08:12 AM

America threatens International Criminal Court over war crime investigations


వాషింగ్టన్: యుద్ధ నేరాల కింద అమెరికా సైనికులను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణ చేపట్టాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ కోర్టుకు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అమెరికన్లపై విచారణ చేపడితే.. ఆంక్షలు విధిస్తామని కోర్టుకు హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన అనేక యుద్ధ నేరాలపై క్రిమినల్ కోర్టు అమెరికా సైన్యాన్ని విచారించాలని భావించింది. అయితే ఆ ప్రయత్నాలను ఎన్‌ఎస్‌ఏ అడ్వైజర్ జాన్ బోల్టన్ తప్పుపట్టారు. క్రిమినల్ కోర్టు అక్రమంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. తమ పౌరులను కాపాడుకునేందుకు అమెరికా ఏదైనా చేస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. 2002లో ఏర్పాటు అయిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో అనేక దేశాలు సభ్యత్వం తీసుకోలేదు. దాంట్లో అమెరికా కూడా ఉన్నది.

3021
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS