ఓ ఆకుకూరపై అమెరికా నిషేధం

Wed,November 21, 2018 06:25 PM

AMERICA ASKS CITIZENS NOT TO EAT LETTUCE

అమెరికాలో నిత్యం వాడే లెట్టూస్ అనే ఆకుకూరపై నిషేధం విధించారు. విశేషించి రొమేన్ లెట్టూస్ అనే ఆకుకూరను వాడొద్దని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) హెచ్చరికలు జారీచేసింది. దానివల్ల ఇ-కోలీ అనే బ్యాక్టీరియా వ్యాపిస్తున్నదని, అందువల్ల ఇంట్లో ఉన్న లెట్టూస్‌ను అందరూ బయట పారెయ్యాలని సీడీసీ ఓ ప్రకటనలో తెలిపింది. చూడడానికి క్యాబేజీలా ఉండే లెట్టూస్‌ను సలాడ్‌గా ఉపయోగిస్తారు. లెట్టూస్‌ను తినడం వల్ల ఇ-కోలీ బారినపడిన కేసులు అమెరికావ్యాప్తంగా 32 వరకు నమోదయ్యాయి. కొన్నాళ్లవరకు రోమేన్ లెట్టూస్ జోలికి అసలు పోవద్దని సీడీసీ స్పష్టం చేసింది. కెనడా కూడా లెట్టూస్‌పై హెచ్చరికలు జారీచేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.

5471
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles