అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనం ఈ వీడియో

Fri,May 3, 2019 03:05 PM

amazing video on motherhood

ఈ సృష్టిలో అపురూపమైనది అమ్మ. అమ్మ అనే పదం ఒక మనుషులకేనా.. జంతువులు, పక్షులు కూడా అమ్మలే. వాటికి కూడా ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. అందుకే అమ్మను దేవతగా కొలుస్తారు. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా అటువంటిదే. అమ్మతనానికి, మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఈ ఒక్క వీడియో చాలు.. తన పిల్లల కోసం తల్లి ఎంతలా కష్టపడుతుందో.

ఓ పక్షి తన గుడ్లను పొదిగింది. అదే ప్రాంతం నుంచి పొలం దున్నే ఓ ట్రాక్టర్ వెళ్తుంటుంది. పక్షి అక్కడున్న విషయాన్ని ఆ వాహనం డ్రైవర్ గమనించకుండా దాన్ని అలాగే పోనిస్తాడు. అయినా కూడా ఆ పక్షి మాత్రం అక్కడి నుంచి కదలదు. ట్రాక్టర్ తన మీది నుంచి వెళ్తే.. చనిపోతా అని తెలిసినా అది మాత్రం అక్కడి నుంచి కదలదు. తను పెట్టిన గుడ్లను తన రెక్కలతో రక్షిస్తూ అలాగే అక్కడే ఉండిపోతుంది. తర్వాత ఈ విషయాన్ని గమనించిన ట్రాక్టర్ డ్రైవర్.. ట్రాక్టర్ కింద పక్షి పడకుండా నెమ్మదిగా తీసుకెళ్తాడు. దీంతో పక్షి ప్రాణాలతో బయటపడుతుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


2852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles