600 వృక్ష జాతులు క‌నుమ‌రుగు..

Tue,June 11, 2019 11:19 AM

Almost 600 plant species lost in the last 250 years

హైద‌రాబాద్‌: వృక్ష‌జాతి అంత‌రిస్తోంది. గ‌డిచిన‌ 250 ఏళ్ల‌లో సుమారు 600 వృక్ష జాతులు క‌నుమ‌రుగైన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఓ విస్త్రృత స్థాయి అధ్య‌య‌నంలో ఈ విష‌యం తేట‌తెల్ల‌మైంది. అయితే తాము చెప్పిన వృక్ష జాతి సంఖ్య వాస్త‌వ‌మే అని, అవి అంచ‌నాలు కావ‌న్నారు. ప‌క్షులు, క్షీర‌దాలు(జీవాలు), ఉభ‌య‌చ‌రాలు అంత‌రిస్తున్న దాని క‌న్నా రెండు రేట్లు ఎక్క‌వ స్థాయిలో వృక్ష జాతులు క‌నుమ‌రుగ‌వుతున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. కీవ్‌లోని రాయ‌ల్ బొటానిక్ గార్డెన్స్‌, స్టాక్‌హోమ్ వ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు ఈ ప‌రిశోధ‌న చేశారు.

అయితే స‌హ‌జ‌సిద్ధంగానే వృక్షాలు సుమారు 500 శాతం వేగంతో అంత‌రిస్తున్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. సుమారు ప‌ది ల‌క్ష‌ల జంతువులు, వృక్ష జాతులు అంత‌రించే ద‌శ‌లో ఉన్న‌ట్లు గ‌త నెల‌లో ఐక్య‌రాజ్య‌స‌మితి త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి వృక్షాలు అంత‌రించాయి, ఇక స‌మీప భ‌విష్య‌త్తులో క‌నుమ‌రుగ‌య్యే వృక్షాల జాబితాను రిలీజ్ చేసిన‌ట్లు యూఎన్ చెప్పింది. చిలి సాండ‌ల్‌వుడ్ వృక్షం అంత‌రించిన‌ట్లు రిపోర్ట్‌లో తెలిపారు. సాండ‌ల్‌వుడ్ ఆయిల్ కోసం ఆ చెట్టుపై ఎక్కువ‌గా ఆధార‌ప‌డేవారు. దాంతో ఆ వృక్షం ఇప్పుడు అంత‌రించే ద‌శ‌కు చేరుకున్న‌ట్లు చెప్పారు. గులాబీ రంగు పువ్వులు పూసే సెయింట్ హెలినా ఒలివ్ చెట్టు కూడా అంత‌రించిన‌ట్లు తెలుస్తోంది. అయితే అంత‌రించిన కొన్ని వృక్షాలు మాత్రం మ‌ళ్లీ క‌నిపిస్తున్నాయ‌ని, ఇది శుభ‌సూచ‌క‌మ‌ని శాస్త్ర‌వేత్తలు అంటున్నారు.

1383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles