వీడియో..గడ్డ కట్టిన నీటిలో మొసలిని చూశారా..?Wed,January 10, 2018 01:28 PM
వీడియో..గడ్డ కట్టిన నీటిలో మొసలిని చూశారా..?


న్యూయార్క్: అమెరికాలో చలి తీవ్రత తారాస్థాయికి చేరి మనుషులతోపాటు జంతువులను కూడా హడలెత్తిస్తోంది. యూఎస్‌లోని ఉత్తరకరోలినాలో చలి తీవ్రత అత్యధికంగా ఉండటంతో సరస్సులు, వాగులు, చెరువుల్లో పూర్తిగా గడ్డకట్టిపోతున్నాయి. ఇక పార్కుల్లో జలచరాల కోసం ఏర్పాటు చేసిన నీటి గుంటలు కూడా ఐస్ గడ్డలా మారాయి. ఇటువంటి భయానక చలి వాతావరణంలో నీటిలో నివసించే జంతువులు నరకాన్ని చూస్తాయి.
స్వాంప్ పార్కులోని నీటిలో కనిపించిన మొసలిని చూస్తే అక్కడ చలి తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది.

గడ్డ కట్టిన నీటిలో నుంచి శ్వాస తీసుకోవడం కోసం ఓ మొసలి తల పైకెత్తి కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని చూస్తుంటే భూమిలోనుంచి ఏదైనా బయటకు పొడుచుకువస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. ఇక మొసలి తల చుట్టూ ఉన్న నీరు మాత్రమే సాధారణంగా ఉండి మిగతా ప్రాంతం అంతా గట్ట కట్టిపోయిన దృశ్యాన్ని మనం చూడొచ్చు. పార్కులోని ప్రధాన భాగం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గడ్డపోయిన నీటిలో బతికిబట్టకట్టేందుకు జంతువులు పడుస్తున్న ఇబ్బందులు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

4907
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS