మొసలి, కొండచిలువ పోరాటం.. గెలుపెవరిది..? వీడియో

Thu,February 21, 2019 05:25 PM

Alligator Vs Python Fight video goes viral

మొసలి, కొండచిలువ.. రెండు రెండే. రెండిట్లో దేన్నీ తక్కువ అంచనా వేయలేం. మరి.. ఆ రెండు పోట్లాడుకుంటే ఎలా ఉంటదో తెలుసా? అది తెలియాలంటే మీరు కింది వీడియో చూడాల్సిందే. అయితే.. మొసలి, కొండచిలువ పోరాటంలో ఏది గెలిచిందో తెలుసా? మీ గెస్ కరెక్టే.. మొసలే గెలిచింది. దాదాపు 10 అడుగుల పొడవు ఉన్న ఆ పైథాన్‌ను మొసలి తన నోటితో కొరికేసింది. దీంతో కొండచిలువ దాని ముందు ఓడిపోక తప్పలేదు. ఈ ఘటన యూఎస్‌లోని ఫ్లోరిడాలో ఉన్న ఎవర్‌గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో ఉన్న షార్క్ వాలీ విజిటర్ సెంటర్‌లో చోటు చేసుకున్నది.

వాటి పోరాటాన్ని ఫ్లోరిడాకు చెందిన రిచ్ క్రుగర్ అనే వ్యక్తి వీడియో తీసి తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఎప్పుడూ మొసళ్లదే గెలుపు అని అనుకునేరు. ఇదివరకు కూడా ఓసారి ఇలాగే ఇదే పార్క్‌లో 10 అడుగుల పొడవు ఉన్న కొండ చిలువ ఏకంగా 4 అడుగులు ఉన్న మొసలిని మింగేయబోయిందట. కాకపోతే వెంటనే గమనించిన పార్క్ సిబ్బంది కొండ చిలువ బారి నుంచి ఆ మొసలిని కాపాడారు.
6556
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles