11 ఖడ్గమృగాల ప్రాణం తీసిన బోరుబావి

Thu,August 30, 2018 03:19 PM

all of 11 kenyan rhinos died due to salty bore water

కెన్యాలో వన్యప్రాణి సంపద దండిగా ఉంది. టూరిజం పెంచిపోషించేందుకు అది ఎంతగానో తోడ్పడుతున్నది. జంతు సంరక్షణకు కెన్యా అనేక చర్యలు చేపడుతూనే ఉన్నది. అంతరించిపోతున్న జాతుల పరిధిలోకి వచ్చే నల్ల ఖడ్గమృగాలను కాపాడేందుకు పెద్ద ప్రయత్నమే జరిగింది. అడవిలోంచి వాటిని ఓ సంరక్షణ కేంద్రానికి తరలించి ఆశ్రయం కల్పించారు. కానీ ఓ చిన్న విషయంలో నిర్లక్ష్యం వల్ల 11 ఖడ్గమృగాలు కన్నుమూశాయి. వాటికి అంతగా వసతి లేని సంరక్షణ కేంద్రం నుంచి మరో కేంద్రానికి తరలించారు. సదుద్దేశంతోనే ఆ పని చేశారు. కానీ అదే వాటి పాలిట శాపమైంది. ఒకటి వెనుక ఒకటిగా అన్నీ పిట్టల్లా రాలిపోయాయి. ఇలా ఎందుకు జరిగిందనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఇప్పుడు ఈ వ్యవహారంపై విడుదలైన అధికారిక నివేదిక అసలు కారణాన్ని వెల్లడించింది. ఖడ్గమృగాలకోసం సంరక్షణ కేంద్రంలో ఓ బోరుబావి తవ్వారు. వాటి దాహం తీర్చి ప్రాణాలు నిలబెడుతుందనే ఉద్దేశంతో ఈ వసతి ఏర్పాటు చేశారు. కానీ ఆ బోరుబావి నీరే వాటి పాలిట విషమైంది. అందులో ఉప్పుశాతం అధికంగా ఉండడం వల్ల వాటి ఆరోగ్యం విషమించి మృత్యువాత పడ్డాయి. చివరి ఖడ్గమృగం ఎంతగా బలహీనమైందంటే ఓ సింహం దాడిచేస్తే తిప్పికొట్టలేక చతికిలబడింది. తర్వాత అదీ గాయాలతో మరణించింది. నిజానికి నీటి సమస్య గురించి హెచ్చరించినా అధికారులు పట్టించుకోలేదని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ పేర్కొన్నది.

2471
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles