రిటైర్‌కానున్న బిలియనీర్ జాక్ మా

Sat,September 8, 2018 12:13 PM

న్యూయార్క్: చైనా బిలియనీర్, ఆలీబాబా సహవ్యవస్థాపకుడు, చైర్మన్ జాక్ మా.. తన పదవి నుంచి రిటైర్‌కానున్నారు. చైనా ఈ-కామర్స్‌లో పేరుగాంచిన ఆలీబాబా సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద కంపెనీగా గుర్తింపు దక్కించుకున్నది. చైర్మన్ పదవికి గుడ్‌బై చెప్పనున్న జాక్ మా.. ఇక నుంచి దాతృత్వ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. విద్యా వ్యవస్థ పటిష్టత కోసం ఆయన తన సంపదను ఖర్చు చేయనున్నారు. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 1999లో జాక్ మా.. ఆలీబాబా ఈ కామర్స్ సంస్థను స్థాపించారు. ఆ కంపెనీ పెట్టకముందు ఆయన ఇంగ్లీస్ టీచర్‌గా చేశారు. చైనాలో బిలియన్ డాలర్ల సంస్థగా ఆలీబాబా మార్కెట్‌లో విస్తరించింది. దీంతో ఆయన ప్రపంచంలో సంపన్న వ్యక్తిగా కీర్తిగాంచారు. 54వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం రిటైర్‌కానున్నట్లు జాక్ మా తెలిపారు.

999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles