కేవలం ఐదు నిమిషాల్లో 22 వేల కోట్ల బిజినెస్!

Sun,November 11, 2018 01:31 PM

Alibaba 24 hour sale gets huge response from customers

షాంఘై: మన దగ్గర ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లాంటి ఈ-కామర్స్ సంస్థలు ప్రకటించే భారీ ఆఫర్లకు ఎంత డిమాండ్ ఉంటుందో తెలుసు. పండుగలు, సీజన్ల వారీగా సేల్ పేరుతో ఈ సంస్థలు భారీ భారీ ఆఫర్లు ప్రకటించి.. కోట్ల కొద్దీ బిజినెస్ చేస్తుంటాయి. ఇలాగే చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా కూడా ప్రతి ఏడాదిలాగే ఆదివారం కూడా 24 గంటల సేల్‌ను ప్రారంభించింది. అయితే ఈ సేల్ ప్రారంభమైన కేవలం ఐదు నిమిషాల్లోనే 300 కోట్ల డాలర్ల (సుమారు రూ.21744 కోట్లు) బిజినెస్ కావడం విశేషం. ఆపిల్, షియామీలాంటి టాప్ బ్రాండ్లపై భారీ ఆఫర్లు ప్రకటించడంతో జనం ఎగబడి కొనుగోలు చేశారు.

తొలి గంటలోనే వెయ్యి కోట్ల డాలర్ల ఉత్పత్తులు అమ్ముడైపోయాయి. గతేడాది అలీబాబా 24 గంటల సేల్ మొత్తం కలిపి కేవలం 2500 కోట్ల డాలర్ల అమ్మకాలు జరిగాయి. ఈ సేల్‌ను అలీబాబా చైర్మన్ జాక్ మానే ప్రారంభించారు. పిల్లలకు వాడే డైపర్ల దగ్గర నుంచి మొబైల్స్ వరకు కొన్ని వేల ప్రోడక్ట్స్‌ను ఈ సేల్‌లో ఉంచారు. లాస్ ఏంజిల్స్, టోక్యో, ఫ్రాంక్‌ఫర్ట్‌లాంటి ప్రపంచ నగరాల నుంచి కూడా ఆర్డర్లు రావడం విశేషం.

7407
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles