తాలిబన్ ఖైదీలను విడుదల చేయనున్న అప్ఘనిస్తాన్

Tue,November 12, 2019 02:44 PM


కాబూల్: హై ర్యాంకింగ్ హోదాలో ఉన్న ముగ్గురు తాలిబన్ ఖైదీలను విడుదల చేయనున్నట్లు అప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని తెలిపారు. తాలిబన్ తీవ్రవాదులు 2016లో ఇద్దరు ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసింది. ఈ ఘటనతో అప్ఘన్ ప్రభుత్వం ముగ్గురు తాలిబన్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.


అష్రఫ్ ఘని మీడియా సమావేశంలో మాట్లాడుతూ..అంతర్జాతీయ భద్రతాదళాల సాయంతో దేశ సరిహద్దుల్లో అరెస్ట్ చేసిన ముగ్గురు ఉగ్రవాదులను బేషరతుగా విడుదల చేయనున్నట్లు చెప్పారు. అయితే తాలిబన్ల కస్టడీలో ఉన్న ఇద్దరు ప్రొఫెసర్ల ఆరోగ్యపరిస్థితి, ఇతర అంశాల గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ప్రొఫెసర్లలో ఒకరు ఆస్ట్రేలియాకు చెందినవారు కాగా..మరొకరు అమెరికా వ్యక్తి.

819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles