విమానం మిస్సయిందని వెనుక పరుగెత్తింది.. వైరల్ వీడియో

Wed,November 21, 2018 01:22 PM

A Woman in Bali tried ti chase down a moving plane after she missed it

బాలి: మనం ఎక్కాల్సిన బస్సో, రైలో మిస్ అయితే ఏం చేస్తాం.. అప్పుడే స్టార్ట్ అయితే వెనుకాల పరుగెత్తి ఎక్కే ప్రయత్నం చేస్తాం. లేదంటే మరో బస్సు కోసం వేచి చూస్తాం. కానీ విమానం మిస్ అయితే వెనుకాల పరుగెత్తిన వాళ్లను ఎప్పుడైనా చూశారా? ఇండోనేషియాలోని బాలిలో ఉన్న ఎన్‌గురా రాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. హనా అనే ఓ మహిళ బాలి నుంచి జకార్తా వెళ్లాల్సి ఉంది. అయితే ఆమె కాస్త ఆలస్యంగా రావడంతో అప్పటికే విమానం కదిలింది. నిజానికి ఆమెకు మూడుసార్లు ఫోన్ చేసినా కూడా స్పందించలేదని ఎయిర్‌పోర్ట్ అధికారులు చెప్పారు. అయితే విమానం కదలడానికి పది నిమిషాల ముందు బోర్డింగ్ గేట్ దగ్గరున్న సెక్యూరిటీని తప్పించుకొని ఆమె రన్‌వేపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. అలాగే కదులుతున్న విమానం దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించగా.. ఇద్దరు సెక్యూరిటీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. ఆ తర్వాత మరో విమానంలో ఆమెను జకార్తా పంపించారు.


6229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles