జాతీయ పతాకంతో విదేశీయురాలు 'కికీ ఛాలెంజ్':వీడియో

Tue,August 14, 2018 12:32 PM

A Woman Has Landed in Trouble for Doing the  KikiChallenge With a Pakistani Flag

ఇస్లామాబాద్: కికీ ఛాలెంజ్.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఊపేస్తున్న వినూత్న ఛాలెంజ్. ఇది ప్రమాదకరమని పోలీస్ అధికారులు ఎంత చెబుతున్నా.. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించి ప్రతిరోజు ఎంతోమంది ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా ఓ విదేశీయురాలు పాకిస్థాన్ జాతీయ పతాకంతో విమానంలోనే డ్యాన్స్ చేసి చిక్కుల్లో పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ప్రయాణికులు లేని ఆగివున్న విమానంలో, బయట పాటకు డ్యాన్స్ చేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్‌ఏబీ) దర్యాప్తును ప్రారంభించింది.

డ్యాన్స్ చేసిన మ‌హిళ‌ను విదేశీయురాలిగా గుర్తించారు. ఒక విదేశీ మహిళ విమానాశ్రయంలోని రన్‌వేపైకి, ఎయిర్‌క్రాఫ్ట్‌లోకి ఎలా వెళ్లిందని ఎన్‌ఏబీ ఛైర్మన్ సంబంధిత అధికారులపై మండిపడ్డారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించారు. పాక్ జాతీయ పతాకంతో ఎయిర్‌క్రాఫ్ట్ వద్ద దిగిన ఫొటోను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఏయిర్‌లైన్స్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పొలాండ్/ఇంగ్లాండ్ చెందిన ఇవా జు బెక్ అనే మహిళ ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను చుట్టివచ్చిందని అందులో పేర్కొంది. తనదైనశైలిలో పాక్ స్వాతంత్య్రదినోత్సవాన్ని జరపుకుంటోందని వ్యాఖ్యానించింది. అయితే ఆమె తమదేశ పతాకాన్ని అగౌరవపరిచిందని పాక్ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
1960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS